హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డు అధికారులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అన్ని శాఖల్లో కలిపి సుమారు 1,050 మంది ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న వారిని విధుల్లో కొనసాగించాలని, వారి అనుభవాన్ని పరిపాలనలో ఉపయోగించుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
అందుకే అందరి పనితీరు, వారిపై వచ్చిన ఆరోపణలు, అవినీతి, అక్రమాలపై ఇంటెలిజెన్స్ నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నట్టు తెలిసింది. అయితే రిటైర్డ్ అధికారుల వల్ల తమకు పదోన్నతులు లభించడం లేదని వివిధ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. వీరి వల్ల పదోన్నతి పొందలేక ఇప్పటికే ఎందరో రిటైర్డ్ అయినట్టు పలువురు వాపోతున్నారు.