హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్‌శాఖలో పెండింగ్‌లో ఉన్న సీఐ, ఎస్సై, మినిస్టీరియల్ సిబ్బంది, కానిస్టేబుల్, కెమికల్ ల్యాబ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని అబ్కారీశాఖ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు సిబ్బంది ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే మంత్రి అబ్కారీశాఖ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మంత్రిని కలిసినవారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, అబారీశాఖ అధ్యక్షుడు టీ రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డీ అరుణ్‌కుమార్, కోశాధికారి టీ లక్ష్మణ్‌గౌడ్ నాయకులు బీ ప్రవీణ్‌కుమార్, కే శ్రీనివాస్, ఎం రవీంద్ర, ఎస్ చంద్రశేఖర్‌గౌడ్, సాధిక్ ఆలీ, నరేందర్‌తో పాటు కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు, అనంత్‌రెడ్డి, మల్లేశ్ తదితరులు ఉన్నారు.
29న నీరా ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన
యాదాద్రి జిల్లా నందనంలో రూ.8 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న నీరా ఉత్పత్తి, అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణ పనులకు 29న శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో క్యాంప్ కార్యాలయంలో నీరా ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన ప్రతిపాదిత నీరా సేకరణ కేంద్రాలైన చేరికొండ, మునిపల్లి, సర్వేలు, చారకొండలోనూ నిర్మాణ పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తిచేసేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. నందనంలో శంకుస్థాపనకు అన్ని గౌడ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. సమీక్షలో టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్‌కుమార్, నవీన్, విజయ్భాసర్ తదితరులు పాల్గొన్నారు.