Constable Sowmya | నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ గంజాయి ముఠా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సౌమ్య కడుపు పై నుంచి కారు వెళ్లడంతో లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయని.. పక్కటెముకలు విరిగిపోయాయని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఎడమ కిడ్నీని కూడా తొలగించామని ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. ఇప్పటికీ సౌమ్య పరిస్థితి విషమంగానే ఉందని.. అయినప్పటికీ వైద్యానికి సహకరిస్తుందని తెలిపారు.