ఒకే పోస్టు.. ఒకే పని వేతనాల్లో వివక్ష!
రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ(సీడీఎంఏ)లో పనిచేస్తున్న వార్డు ఆఫీసర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకే పోస్టు, ఒకే రకమైన బా ధ్యతలు నిర్వర్తిస్తున్నా.. కొందరు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వేతనం, మరికొందరు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ వేత నం పొందుతున్నారు.
- మున్సిపల్ వార్డు ఆఫీసర్లతో అధిక పని..ఇచ్చేది మాత్రం రికార్డ్ అసిస్టెంట్ వేతనమే
- గ్రూప్-4 సిబ్బందికి అన్యాయం
- వివక్షపై వార్డు ఆఫీసర్ల ఫైర్
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ(సీడీఎంఏ)లో పనిచేస్తున్న వార్డు ఆఫీసర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకే పోస్టు, ఒకే రకమైన బా ధ్యతలు నిర్వర్తిస్తున్నా.. కొందరు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వేతనం, మరికొందరు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ వేత నం పొందుతున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 ద్వారా ఎంపికైన 1,862 మంది వార్డు ఆఫీసర్లు ప్రస్తుతం ఈ వేతన వివక్షతో కుంగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ విధు లు నిర్వర్తిస్తున్న తమపై కాంగ్రెస్ ప్రభు త్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడుతున్నారు.
గత ప్రభుత్వంలో రెవెన్యూశాఖ నుంచి మున్సిపల్‌శాఖలో విలీనమైన వీఆర్ఏలు, వీఆర్వోలను వార్డు ఆఫీసర్లుగా నియమించి, వారికి ‘జూనియర్ అసిస్టెంట్’ క్యాడర్ పేసేల్ అమ లు చేస్తున్నారు. ఇటీవల కొందరు తిరిగి రెవెన్యూశాఖకు వెళ్లినప్పటికీ, మరికొందరు మున్సిపల్ శాఖలోనే జూనియర్ అ సిస్టెంట్ క్యాడర్ వేతనంతో కొనసాగుతున్నారు. కానీ, గ్రూప్-4 ద్వారా నియమితులైన వార్డు ఆఫీసర్లకు మాత్రం ‘రికార్డ్ అసిస్టెంట్ పేసేల్ మాత్రమే ఇస్తున్నా రు. ఒకే ఆఫీసులో, ఒకే సీట్లో కూర్చుని ఒకే పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో వేతన తేడా ఏంటని వార్డు ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

