కన్నాయిగూడెం, ఆగస్టు 5 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ అధికారులు రెండు మోటర్లను బుధవారం బంద్ చేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 31న ప్రాజెక్టులోని 9 మోటర్లను ఆఫ్ చేశారు. ఈ నెల 1న రెండు మోటర్లు, 2న 6, 3వ తేదీన ఒక మోటర్‌ను ఆన్‌చేసి మొత్తం 9 మోటర్లను నడిపించారు.
4వ తేదీన ఫేస్-3లో ఒక మోటర్‌ను బంద్ చేయగా, 5వ తేదీన ఫేజ్-1లో విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా రెండు మోటర్లను నిలిపివేశారు. ప్రస్తుతం 7మోటర్లను నడుపుతూ 1,811 క్యూసెక్కుల నీటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భీమ్ఘనపురం రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నట్టు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం 78.40 మీటర్లుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.