పత్రాలు ఇచ్చిండ్రు.. బిల్లులు రావంటున్నరు!
అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్ కాపీ అందించిన అధికారులు.. అప్పుచేసి స్థలం కొని.. అందులో పిల్లర్లు లేపుకున్న తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు.
- నిరుపేద కుటుంబానికి శాపంగా అధికారుల నిర్లక్ష్యం
- ప్రొసీడింగ్స్ ఇవ్వడంతో అప్పుచేసి స్థలం కొనుగోలు
- పిల్లర్లు వేసినా విడుదల కాని బిల్లులు
- గతంలో ఇల్లు తీసుకున్నారంటున్న అధికారులు
- డ్రైనేజీపై రేకుల షెడ్డులో జీవిస్తున్న బాధిత కుటుంబం
గణపురం, ఆగస్టు 5 : అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్ కాపీ అందించిన అధికారులు.. అప్పుచేసి స్థలం కొని.. అందులో పిల్లర్లు లేపుకున్న తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. గతంలోనే మీ పేరు తో ఇల్లు మంజూరైందని, ఇప్పుడు బిల్లులు రావని చెప్పడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నది. బాధితులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన మావురపు లలిత-సమ్మయ్య దంపతులకు 2025 జూలై 16న జరిగిన గ్రామసభలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ అందజేశారు.
దీంతో ఆ దంపతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి స్థలాన్ని కొనుగోలు చేసి, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి పిల్లర్లు కూడా లేపా రు. అయితే పనులు మొదలై ఏడాది గడుస్తున్నా అధికారులు బిల్లులు మంజూరు కాకపోవడంతో అధికారులను నిలదీశారు. దీంతో మీకు ఉమ్మడి రాష్ట్రంలో (2006-2007) ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉందని, అందువల్లే బిల్లులు రావడం లేదని చెప్పారు. అయితే గతం లో తీసుకున్న డబ్బులను మినహాయించి మిగిలినవి విడుదల చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తా ము చెల్పూరు ప్రభుత్వ ఆస్పత్రి పకన డ్రైనేజీపై ఏర్పాటు చేసుకున్న చిన్న రేకుల షెడ్డులోనే కాలం వెళ్లదీస్తున్నామంటూ కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఇంటి బిల్లును విడుదల చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

