గుడిపల్లి లిఫ్ట్ నీటిపై బెంగ
రైతన్నల సాగు కష్టాలను చూ సి.. ఎల్‌నినోను ఎదిరించి కృష్ణమ్మ పరవళ్లు తొక్కు తోంది. సమైక్య పాలకుల చేత సాగునీటి గోస పడిన తెలంగాణకు ఆంధ్రా పాలకులు కొల్లగొట్టముందే కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టుల చెంతకు నీలవేణి దరి చేరింది.
- కళ తప్పిన మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
- 2.60 టీఎంసీలే కేటాయింపు
- కృష్ణమ్మకు వరద వచ్చినా.. చుక్క నీటిని ఎత్తిపోయని లిఫ్ట్-3 మోటర్లు
- వానకాలంలోనూ నిరాశ‘జల’కం
- చివరి ఆయకట్టుకు జలాలు చేరేనా?
- ఆందోళనలో ఆయకట్టు రైతులు
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కొల్లాపూర్, ఆగస్టు 5 : రైతన్నల సాగు కష్టాలను చూ సి.. ఎల్‌నినోను ఎదిరించి కృష్ణమ్మ పరవళ్లు తొక్కు తోంది. సమైక్య పాలకుల చేత సాగునీటి గోస పడిన తెలంగాణకు ఆంధ్రా పాలకులు కొల్లగొట్టముందే కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టుల చెంతకు నీలవేణి దరి చేరింది. కానీ ఇంకా సమైక్య పాలకుల నీడలో ఉన్న ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తే గత ప్రభుత్వానికి పేరొస్తోందని దుర్భుద్దితో తెలంగాణ పంట పొ లాలకు సాగునీరు అందించకుండా ఎండపెడు తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీ శైలం నిండుకుండలా ఉన్నా ఎత్తిపోయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని రైతు సంఘాలు వి మర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణమ్మ కదం తొ క్కుతూ శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ స్టేజీకి వచ్చి నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలమూరు రైతాంగంపై కనికరం కలగడం లేదన ందుకు ఇప్పటి వరకు కృష్ణానది నుంచి ఎత్తిపోసిన గణాంకాల వివరాలే తెలియజేస్తున్నాయి. 13 రోజుల పాటు కేఎల్ఐ కేవలం 2.60 టీఎంసీలను మాత్రమే ఎత్తిపోస్తే, పాలమూరు లిఫ్ట్ ద్వారా జూలై 14న 0.01 టీఎంసీ, జూలై 17న 0.00096 టీఎంసీని మాత్రమే డ్రా చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా.. ఈ రెండు ఎత్తిపోతల నుంచి ఎందుకు నీళ్లను ఎత్తిపోయడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
వానకాలంలోనూ రైతులకు భంగపాటు
ఈ ఏడాది వర్షాలు పడక రైతులు నిరాశకు లోన య్యారు. అయితే ఎగువ కురిసిన వర్షాలతో కృష్ణ మ్మకు ఆలస్యంగా వరద రాక మొదలైంది. దీంతో వా నకాలం పంటలను సాగు చేసుకోవచ్చన్న ఆనందం లోకి రైతులు వచ్చారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చిన నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం రైతులను భంగపాటుకు గురిచేస్తోంది. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు లేదా శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా కోతిగుండు నుంచి నీ టిని ఎత్తిపోసుకునేందుకు అనుకూలంగా ప్రాజె క్టుల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా అతిత క్కువ సామర్థ్యంతో ఉన్న కేఎల్‌ఐతోపాటు భారీ సామర్థ్యం కలిగిన పీఆర్ఎల్ఐకు కో తిగుండు వద్ద కృష్ణానది నీళ్లు పు ష్కలంగా లభిస్తాయి.
ఎల్‌నినో ఎఫెక్ట్ గురించి అవగాహన కలిగిన ప్రభు త్వం కృష్ణానదిలోని నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపకుండా అలసత్వం వహించిందని రైతులు ఆరో పిస్తున్నారు. నదికి భారీగా వరద వచ్చినా జలాలను ఎత్తిపోయకపోవడంపై ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వానకాలం మధ్యలోనైనా కేఎల్ఐ ద్వారా సాగునీళ్లు అందిస్తే సకాలంలో పంటలను సా గు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. సీజన్ చివరిలో నీళ్లు వదిలితే రైతులకు లాభం ఉండదని, చివరి ఆయకట్టు వరకు నీరు పారించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎత్తిపోయని గుడిపల్లి ఎత్తిపోతల పథకం
ఎంజీకేఎల్‌ఐలో మూడో దశ గుడిపల్లి రిజర్వాయర్ అత్యంత కీలకం. టీఎంసీ సామర్థ్యం కలిగిన ఈ రిజ ర్వాయర్ అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అంది స్తోంది. కేఎల్ఐ మొత్తం 4.24 లక్షల ఎకరాల ఆయక ట్టు ఉంటే.. 2/3 వంతు గుడిపల్లిపైనే ఆధారపడి ఉన్నది. 13 రోజుల నుంచి కేఎల్ఐ స్టేజీ -1, స్టేజీ -2 పంప్‌లు నదీ జలాలను ఎత్తిపోస్తుంటే స్టేజీ-3లోని మోటర్లు చుక్క నీరును గుడిపల్లిగట్టు రిజర్వాయ ర్ లోకి ఎత్తిపోయడం లేదని సాగునీటి నిపుణులు, రైతులు పేర్కొంటున్నారు.
ఎత్తిపోసింది 2.60 టీఎంసీలే..
కృష్ణానదిలో కేఎల్ఐ నికర వాటా కలిగి ఉన్నది. ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసినా ఎగువ నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టలేకపోతున్నది. ఈ ప్రభుత్వం. గత నెల 26న కేఎల్ఐ స్టేజీ -1 వద్ద 2, 4 మోటర్లు 30 వాట్స్ సామర్థ్యంతో రోజుకు 1600 క్యూసెక్కుల చొప్పున కృష్ణానది నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగోటం రిజర్వాయర్‌కు మెయిన్ కెనాల్ ద్వారా.. అక్కడి నుంచి జొన్నలబొగుడ వరకు గ్రావిటీ ద్వారా జలాలు చేరుతున్నాయి. ఎల్లూరు, సింగోటం రిజర్వాయర్లలో దాదాపు 2 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
రేగుమాన్గడ్డ నుంచి గ్రావిటీ ద్వారా చేరిన నదీ నీటిని పెన్-స్టాక్ పైప్లైన్ల ద్వారా స్టేజీ-2లో జొన్నలబొగుడ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం జరుగుతోంది. జొన్నలబొగుడ రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీఎంసీలు ఉంటే ఇప్పటికే రిజర్వాయర్‌లోకి ఒక టీఎంసీ జలాలు చేరాయి. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి గుడిపల్లి వరకు కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి.. కానీ అక్కడి నుంచి చివరి ఆయ కట్టు నీళ్లు ఎత్తిపోయకపోవడంతో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉన్నా.. నీటిని ఎక్కవగా డ్రా చేయలేకపోతోందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉండగా వరద ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కేవలం 2.60 టీఎంసీలనే ఎత్తి
పోశారు.
కృత్రిమ ఎల్‌నినో సృష్టించే పనిలో ప్రభుత్వం
ఈ ఏడాది కృష్ణమ్మకు వరద వస్తుందా..? లేదా? అనే సందేహం ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల కారణంగా భారీ వరద వస్తున్నది. అయితే తెలంగాణ సాగునీటి వాటా పూర్తిగా వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా.. అటు వైపు ప్రభుత్వం ఆలోచన లేనట్లు స్పష్టమవుతోంది. నదికి వరద రావడంతో ప్రకృతి సృష్టించిన ఎల్‌నినో నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తున్న ఎల్‌నినో ఎఫెక్ట్ నుంచి తప్పించుకునేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయిందని రైతు సంఘాలు ఆవేదన చెందుతున్నాయి.
పాలమూరు పథకం నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. కేఎల్ఐ నుంచి ఎత్తిపోస్తున్న కొద్దిపాటి నీటిని కూడా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద ఎత్తిపోయకుండా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రావిటీ ద్వారా రోజుకు 2 టీఎంసీలను డ్రా చేసే ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యూలేటరీ తెరిస్తే శ్రీశైలం ఖాళీ అవడం ఖాయం. ఇప్పటికైనా రేగుమాన్గడ్డ నుంచి వచ్చే నీటిని గుడిపల్లి స్టేజీ -3లోని పంప్‌లను ఆన్ చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

