బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి రూ.10 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.