Vinod Kumar | హనుమకొండ చౌరస్తా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) రాజ్యాంగాన్ని( Constitution ) మార్చే ప్రయత్నం చేస్తుందని.. రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్( Vinod Kumar ) మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ( Hanumakonda ) లోని కాకతీయ విశ్వవిద్యాలయం( Kakatiya University ) సెనెట్హాల్లో వీసీ రమేశ్ అధ్యక్షతన సింపోజియం ‘ఛేంజింగ్ సినారియో ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 1954లోనే యూపీ ముఖ్యమంత్రిని దించారని, నెహ్రూ( Nehru ) పీఎంగా ఉన్న క్రమంలోనే రాష్ర్టాన్ని కూలదోసిందన్నారు. కేరళ( Kerala )లో ఉన్న వామపక్ష పార్టీని కూల్చారని గుర్తు చేశారు. 1967లో ఇందిరాగాంధీ( Indira Gandhi ) ప్రధానిగా ఉన్నప్పుడు యూపీ, బిహార్, కేరళ, తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వాలు పెత్తనం చెలాయించాయని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాష్ర్టాల హక్కులను కబలిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యావిధానం రుద్దే ప్రయత్నం చేస్తుందని, భారతదేశంలో ఏకపార్టీ పాలన కొనసాగుతుందన్నారు. 2019లో మోదీ( Modi ) ప్రమాణస్వీకారం తర్వాత రెండు రోజుల్లోనే తమిళనాడులో బోర్డులపై, రైళ్లపై ఇంగ్లిష్, హిందీ ఉంచే ప్రయత్నం చేయగా తీవ్రపరిణామాలు ఎదుర్కొని తలవంచాడని, ప్రజల ఒత్తిడి మేరకు మాతృభాషలోనే ఉంచారని గుర్తుచేశారు. అమిత్‌షా( Amit Shah ) సైతం ఎంబీబీఎస్ హిందీలో ఉంటుందనడం సరైంది కాదన్నారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1062 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తే రాష్ట్ర గవర్నర్( Governor ) నిలిపివేసిందని, గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం తప్పలేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా ప్రతి వస్తువుపై జీఎస్టీ( GST ) ద్వారా కేంద్రానికి చెల్లిస్తున్నామన్నారు. రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పనిచేయకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కేంద్రం చెప్పిందే వినాలి లేకుంటే అప్పులు చేయనివ్వదు.. గోదావరి( Godavari ), కృష్ణా( Krishna ) నది ప్రాజెక్టుల కోసం, పవర్ ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తున్నాం, అప్పు తీసుకువచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాడటం లేదని, దుబారా ఖర్చు చేయడం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.