Kapilavai Dileep kumar | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఓ మాజీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఆ మాజీ ఎమ్మెల్సీ పార్టీని వీడినట్లు సమాచారం. మరి ఆ మాజీ ఎమ్మెల్సీ ఎవరంటే కపిలవాయి దిలీప్ కుమార్.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కపిలవాయి దిలీప్ కుమార్.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ ఆర్ఎల్డీ కండువా కప్పున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా కపిలవాయి దిలీప్ కుమార్‌ను అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరికి కపిలవాయి దిలీప్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.