Ravula Chandrashekar Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు బంజారాహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ నివాసంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం రావులకు కేటీఆర్ బర్త్ డే విషెష్ చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.