కల్వకుర్తి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చే యాలని అచ్చంపేట మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో సాయిరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ బాలరాజు ప్ర భుత్వ తీరు, రేవంత్‌రెడ్డి కుటుంబ దౌర్జన్యకాండపై తీ వ్రంగా మండిపడ్డారు. గ్రామంలో దాదాపు 13 ఏండ్లు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. 85 ఏండ్ల సాయిరెడ్డిపై రేంవత్‌రెడ్డి కుటుంబం పగబట్టడం దారుణమని అన్నారు. రేవంత్‌రెడ్డి సోదరుల ఆగడాలు తట్టుకోలేకే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.