హైదారాబాద్,జూన్1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానికిగా మరో పదేండ్లు పొడిగించాలని, దీనికోసం ఏపీలోని అన్ని పార్టీలు ఐక్యంగా పోరడాలని మాజీ ఏపీసీసీ చీఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. ఏపీతో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం ఆదివారంతో ముగియునుండటంతో శైలజానాథ్ విచారం వ్యక్తం చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిషరించకుండానే శాశ్వత ముగింపు పడిందని వాపోయారు. ఎంసెట్ సహా 7 రకాల ప్రవేశ పరీక్షలకు ఈ ఒక ఏడాది మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందని శైలజానాథ్ ఆరోపించారు.