బీజేపీకి బీ టీం కాంగ్రెస్
బీజేపీకి బీ టీం కాంగ్రెస్ అని, ప్రధాని మోదీతో భేటీ అయ్యాకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
- రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫైల్‌ను తొక్కిపెట్టిన గవర్నర్
- కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఫైల్‌ను ఎలా ఆమోదించారు?
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం
మేడ్చల్/శామీర్‌పేట/మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 31: బీజేపీకి బీ టీం కాంగ్రెస్ అని, ప్రధాని మోదీతో భేటీ అయ్యాకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండల బీఆర్ఎస్ కృతజ్ఞతా సభను బుధవారం శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీల ఫైల్‌ను తొక్కిపెట్టిన గవర్నర్.. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ ఫైల్‌ను 2 రోజుల్లోనే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలను కాలరాయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
ఏది చచ్చిన పార్టీ?
గత అసెంబ్లీ ఎన్నికల్లో 1.8% ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికే కాంగ్రెస్ ఎగిరి పడుతున్నదని మండిపడ్డారు. 1.8% ఓట్ల తేడాతో ఓడిన పార్టీ చచ్చిన పార్టీ అయితే, 2014లో కేవలం 29% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఏమైనట్టు అని ప్రశ్నించారు. ఉన్నత విద్యావంతులు, అణగారిన వర్గాల ప్రతినిధులైన కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్‌కుమార్ గురించి దొడ్లో చెప్పులు మోస్తారంటూ అహంకారపూరితంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం గర్హనీయమని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలు, అభివృద్ధి మీద బీఆర్ఎస్ 4,700 ప్రశ్నలు సంధిస్తే.. కాంగ్రెస్, బీజేపీ 800 ప్రశ్నలు మాత్రమే వేశాయని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశ్, చామకూర భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

