బిజినేపల్లి, జనవరి 7: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుచరులతో వచ్చిన నాగంను రైతులు అడ్డుకున్నారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగిన నువ్వు.. నియోజకవర్గానికి ఏం చేశావ్? మార్కండేయ రిజర్వాయర్ పనులు ప్రారంభం కాకముందే ఏం చూడటానికి వచ్చావ్?’ అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకపోగా.. మంజూరైన వైద్య కళాశాలను అమ్ముకున్నావని ధ్వజమెత్తారు.