Jagadish Reddy | అధికార మదంతో కోమటిరెడ్డి ప్రవర్తిస్తున్నడు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Jagadish Reddy | అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. భోజనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై జరిగిన దాడిపై మండిపడ్డారు. దాడి ఘటనపై ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
Jagadish Reddy | అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. భోజనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై జరిగిన దాడిపై మండిపడ్డారు. దాడి ఘటనపై ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. భోనగిరి జడ్పీ చైర్మన్‌పై జరిగిన దాడి ఆయన ఆటవిక ప్రవర్తనకు తార్కాణమని విమర్శించారు. రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయ్యడం దారుణమన్నారు.
అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఇంతటి ఆటవికంగా ప్రవర్తించండం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. అంతటి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికి రాదన్నారు. మంత్రి హోదాలో బుద్ధిగా ఉంటారని జిల్లా ప్రజలు ఆశించారన్నారు. జిల్లా ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారన్నారు. ఆయన చేసిన దీక్ష తెలంగాణ కోసం కాదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తొలగిస్తారనే పదవికి రాజీనామా చేశాడని.. ఊడిపోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతుండని మండిపడ్డారు. తెలంగాన ఉద్యమ సమయంలో వైఎస్ బూట్లు నాకిండని మండిపడ్డారు.
రెవంత్ రెడ్డి బెడ్రూంలో కాళ్లు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదన్నారు. దివంగత మంత్రి మాధవరెడ్డి అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర ఆయనదన్నారు. 20 ఏండ్ల పాలనలో జిల్లాకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని, హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుంటే అసహనంతోటే విపక్షాల మీద దాడులు చేస్తున్నారన్నారు. చెప్పుతో కొట్టండి అన్న నోరే చేతులతో నెట్టేదాకా చేరిందన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే జిల్లాలో తిరగలేవన్నారు. కోమటిరెడ్డి చరిత్ర చాలా ఉందని.. సందర్భానుసారాంగ బయట పెడతామంటూ జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

