హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సిగలో మరో బొగ్గుగని చేరింది. పీకే ఓసీ -2 ( ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ ) కోల్ బ్లాక్‌ను సింగరేణి దక్కించుకుంది. సోమవారం నిర్వహించిన గనుల వేలంలో సంస్థ ఈ బ్లాక్‌ను దక్కించుకుంది. ఈ బొగ్గు గనిలో 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలుండగా, . ఏడాదికి ఆరు మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయవచ్చును. దాదాపు 25 ఏండ్ల పాటు ఈ గని నుంచి బొగ్గును వెలికితీయవచ్చును. ఈ కోల్బ్లాక్తో దాదాపు 2వేల మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే సంస్థకు రూ.43 వేల కోట్ల ఆదాయం సమకూరవచ్చునని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల నిధులు సమకూరవచ్చునని అంచనా.