నల్లగొండ, జనవరి 28: రాష్ట్రంలో పదేం డ్ల అభివృద్ధిని ఏడాదిలోనే విధ్వంసం చేసిన రేవంత్‌రెడ్డి పాలనను ఎండగట్టి, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ల పక్షాన రంగంలోకి దిగారని మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి చెప్పా రు. కేటీఆర్ టార్గెట్ రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి తప్ప ఏ మంత్రి కూడా కాదని పేర్కొన్నా రు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు కేసీఆర్.. పదేండ్లు సీఎంగా ఉండి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే శారని వివరించారు. పదేండ్ల బంగారు తెలంగాణను ఏడాదిలోనే రేవంత్‌రెడ్డి సర్వనాశ నం చేసినందునే బీఆర్ఎస్ పోరుబాట ప ట్టిందని చెప్పారు. ఈ ధర్నాకు వచ్చిన రైతులను చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అన్నదాతల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతున్నదని చెప్పారు. నల్లగొండ స్ఫూర్తితోనే రాష్ట్రమంతా బీఆర్ఎస్ తిరిగి రైతుల పక్షాన కొట్లాడుతుందని ప్రకటించారు.
హామీల అమలు ఏమాయె?
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లే దు. కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తే, కాం గ్రెస్ రూ.రెండు లక్షలు మాఫీ చేస్తుందని ప్ర కటించి రైతులను మోసంచేసింది. అన్ని పం టలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి సన్న ధాన్యానికే పరిమితం చేశారు.
-రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
ప్రజా వ్యతిరేక పాలన
రాష్ట్రంలో ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల ను ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్రంలో 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డ నేపథ్యంలో కేసీఆర్ ఆ రంగాన్ని పండుగలా మా ర్చారు. 11 దఫాలుగా రైతుబంధు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ రైతుబంధు ఎగొట్టింది.
-ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
అన్ని రంగాల్లో ఆగం
బీఆర్ఎస్ పదేండ్లలో అమలుచేసిన సంక్షే మ, అభివృద్ధి పథకాలు ఆగిపోవద్దనే ఆలోచనతో ఓపిక పట్టాం. కానీ, కేసీఆర్ పథకాలకు రేవంత్ సర్కారు స్వస్తి పలికి రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నది. రైతుల సమస్యలపై పోరాడేందుకు ధర్నాకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
-కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
417 రైతు ఆత్మహత్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 417 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 417 మంది రైతు లు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలతో రోజుకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. లగచర్ల, రామన్నపేటలో రైతులు, ప్రజలకు కాంగ్రెస్ పెట్టిన బా ధలను ఈ రాష్ట్రం మరువదు.
-గొంగిడి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఫూల్స్ చేసేందుకే..
నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మండలంలో ఒక్క గ్రామానికే పరిమితం చేశారు. రైతుభరోసా వెంటనే వేస్తామని చెప్పి మార్చి 31 వరకు గడువు పెట్టారు. అదీ గ్యారెంటీ లేదు. ఇదంతా రైతులు, ఇతర ఆశావహులను ఏప్రిల్ 1న ఫూల్స్ చేయడానికే.
-గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
మాఫీపై మంత్రి చేతులెత్తేశారు
రాష్ట్రంలో రూ.రెండు లక్షలకు మించిన పంటరుణాలున్న రైతులతోపాటు పలు కారణాలతో రూ.రెండు లక్షలకు లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వివరిస్తే, ఆయన ఇక చేయలేమని చేతులెత్తేశారు. పాలన చేయలేక వచ్చిన కాడికి దోచుకోవడానికే చూస్తున్నారు.
-నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే
కోమటిరెడ్డినే చెప్పుతో కొట్టాలి
రైతుభరోసా రాలేదన్నవారిని చెప్పుతో కొట్టాలని మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన మాటలను రైతులు మ ర్చిపోలేదు. మూడు సీజన్లుగా రైతుభరోసా ఇవ్వని కో మటిరెడ్డినే రైతులు చెప్పుతో కొట్టాలి. పొద్దున ఒకమాట, సా యంత్రం ఒకమాట మాట్లాడే కోమటిరెడ్డి, గాలి మోటర్లల్లో తిరిగే ఉత్తమ్‌కి రైతుల బాధలు ఏం తెలుస్తాయి.
-బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డిది రాక్షసపాలన
ప్రజాపాలన తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రాక్షసపాలన సాగిస్తున్నారు. పథకాలు పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోతున్నామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారంటేనే రేవంత్ పాలన ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతున్నది.
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
హామీలపై కాంగ్రెస్‌ను నిలదీయాలి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏడాదిగా అమలు చేయలేదు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసి తరిమికొట్టాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతులకు కరెంటు, సాగునీరు, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు రాలేదు.
-పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మోసం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. ఏడాదిగా అమలుచేయని పథకాలను స్థానిక ఎన్నికలు రాగానే గుర్తుకొచ్చి దరఖాస్తులు పెట్టిస్తున్నారు. అవి అమలయ్యేది లేదు. రైతులకు ఇచ్చిన హామీలపై అడగడానికి ధర్నా పెడితే కుట్రలతో కాంగ్రెస్ సర్కారు అనుమతి రాకుండా అడ్డుకున్నది. రేవంత్ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
-నోముల భగత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
ఒక్క ఏడాదిలోనే ఆగమాగమైనం
రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చాక ఒక్క ఏడాదిలోనే ఆగమాగమైనం. కరెంటు సక్కగ రాక మోటర్లు కాలిపోయినయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్కపూట కూడా కరెంటు పోయేది కాదు. ఐకేపీలో వడ్లు అమ్ముకుంటే వారంలోపే బ్యాంకు ఖాతాలో డబ్బులు పడేవి. ఈ సారి నెలరోజులు ఐకేపీలోనే వడ్లకు కాపాలా ఉండాల్సి వచ్చిం ది. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు డబ్బులు ఎరువులు, ఇతర పొలం పనులకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు రైతుబంధు లేదు.. రైతుభరోసా రాలేదు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులు సంతోషంగా ఉంటారు.
-సూదిరెడ్డి అమృతారెడ్డి, చిన్నసూరారం, తిప్పర్తి
మేము తీసుకున్న గోతిలో మేమే పడ్డాం
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమైండ్రు. వద్దు వద్దు అన్నా వినకుండా ఒక్కసారి చూద్దామని కాంగ్రెస్‌కు ఓట్లేస్తే ఏడాదిలోనే 20 ఏండ్ల గోస తీపించిండ్రు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు పత్తికి, వడ్లకు ఏ ఇబ్బందీ లేకుండా మంచి ధరకు అమ్ముకునేది. ఇప్పుడు అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకున్నాం. ఆరేండ్ల నుంచి రైతుబంధు వస్తే పెట్టుబడి కి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మళ్లీ అప్పులు తెస్తే ఖర్చులు పోను మిగిలింది అంతా మిత్తికే సరిపాయె. మా గోతులు మేమే తోడుకున్నట్టయ్యింది.
-చెరుకు మైసయ్య, అన్నెపర్తి, నల్లగొండ