Harish Rao | స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : హరీశ్‌రావు
Harish Rao | డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు.. ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | హైదరాబాద్ : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు.. ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారింది. కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ వందల మంది నర్సులు శుక్రవారం రాత్రి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో నిర్వహించారు. డీపీహెచ్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నిరసన తెలిపారు. ‘హెల్త్ మినిస్టర్ రావాలి’.. ‘మాకు న్యాయం చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. లాంగ్ స్టాండింగ్ జాబితా నుంచి పలువురి పేర్లు మాయమయ్యాయని, అర్హత లేని, బయటి సంఘాల నుంచి వచ్చిన సిఫారసు లేఖలను తీసుకొని కొందరిని రిటెయిన్ చేశారని, ఒక్కో బదిలీకి రూ. లక్షల్లో డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. రాత్రి వరకు నర్సుల ఆందోళన కొనసాగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నర్సులకు సర్దిచెప్పేందుకు డీపీహెచ్ రవీంద్రనాయక్ మెడికల్ కాలేజీకి రాగా.. నర్సులు ఆయనను ఘెరావ్ చేసి నిలదీశారు. తమకు న్యాయం చేసేవరకు కౌన్సెలింగ్ నిర్వహించొద్దంటూ వాదించారు.
ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది.
బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం… pic.twitter.com/qmHO8grwDM
— Harish Rao Thanneeru (@BRSHarish) July 20, 2024
ఇవి కూడా చదవండి..
OU | ఓయూలో సీఎం రేవంత్‌కు క్షీరాభిషేకం.. అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

