OU | ఓయూలో సీఎం రేవంత్‌కు క్షీరాభిషేకం.. అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు
గ్రూప్ 2 పరీక్షల వాయిదాతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయతలపెట్టిన కా ంగ్రెస్ కార్యకర్తలకు ఉస్మానియా యూనివర్సిటీలో చుక్కెదురైంది. ఆ కార్యక్రమాన్ని డీఎస్సీ అభ్యర్థులు అడ్డుకోవడంతో మెయిన్ లైబ్రరీ ప్రాంగణం నుంచి ఆ బృందం తోకముడిచింది.
- తోకముడిచిన కాంగ్రెస్ కార్యకర్తల బృందం
- ఆర్ట్స్ కాలేజీ వద్ద తూతూమంత్రంగా కార్యక్రమం
OU | ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: గ్రూప్ 2 పరీక్షల వాయిదాతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయతలపెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఉస్మానియా యూనివర్సిటీలో చుక్కెదురైంది. ఆ కార్యక్రమాన్ని డీఎస్సీ అభ్యర్థులు అడ్డుకోవడంతో మెయిన్ లైబ్రరీ ప్రాంగణం నుంచి ఆ బృందం తోకముడిచింది. దీంతో ఓయూలో ఉద్రిక్తత నెలకొన్నది. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేయడంతో టీపీసీసీ అ ధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యం లో ఓయూ మెయిన్ లైబ్రరీ ఎదుట రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయతలపెట్టారు.
అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు గ్రం థాలయంలోకి వచ్చి విద్యార్థులను రావాలని కోరగా వారంతా తిరగబడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఆందోళన చేస్తే పోలీసులను ప్రయోగించి, బలవంతంగా అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని దు య్యబట్టారు. అటువంటి సీఎంకు క్షీరాభిషేకం కార్యక్రమానికి తామెలా మద్దతిస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించడంతో దయాకర్ బృందం అక్కడి నుంచి జారుకున్నది. ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తూతూమంత్రంగా రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

