Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. ములుగు జిల్లాలో అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదు
Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోనే ఉంది. అయితే ఈ వారాంతంలో తెలంగాణ రికార్డు వర్షపాతాన్ని నమోదు చేసింది.
Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోనే ఉంది. అయితే ఈ వారాంతంలో తెలంగాణ రికార్డు వర్షపాతాన్ని నమోదు చేసింది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో 96.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 40 నుంచి 80 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీనంగర్, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 18 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Godavari | భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
OU | ఓయూలో సీఎం రేవంత్‌కు క్షీరాభిషేకం.. అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

