Traffic Restrictions | రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌కు 2 కిలో మీటర్ల పరిధిలో ఈ అంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌కు 2 కిలో మీటర్ల పరిధిలో ఈ అంక్షలు అమల్లో ఉండనున్నాయి.
కర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పారడైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. స్టేషన్లోకి ప్లాట్ ఫాం నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
ఈ రోడ్లు మూసివేత
టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్‌కు వచ్చే రోడ్
బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు
జనరల్ బజార్ రోడ్
ఆదయ్య ఎక్స్ రోడ్
మళ్లింపు మార్గాలు ఇవే..
-సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
-సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను బేగంపేట నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.
-బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లించనున్నారు.
-ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యారడైస్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.
-ప్యారడైస్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పారడైస్ మీదుగా మళ్లించనున్నారు.
-హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్ వరకే అనుమతించనున్నారు. మళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.
బోనాల జాతరకు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఇవే..
హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, ఆదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్.
ఇవి కూడా చదవండి..
Rain | హైదరాబాద్ ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన..
Corn | మొక్కజొన్నకు హైదరాబాదీలు ఫిదా.. పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి
Jurala | జూరాలకు పెరిగిన వరద ప్రవాహం.. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

