Rain | హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన..
హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వాన (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్..
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వాన (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్, తార్నాకలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపై నీరునిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు.
కాగా, రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- Hyderabad
- IMD Hyderabad
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

