Harish Rao | హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములను మేము తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. మరి నేడు ఐసీఐసీఐ బ్యాంక్ మేము తనఖా పెట్టుకోలేదు అని చెబుతోంది. అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు? రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా ? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కి(టీఎస్ఐఐసీ) ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసీ మా వద్ద ఎట్టి స్థలాన్ని మార్టిగేజి చేయలేదని స్పష్టంగా తెలియజేయదల్చుకున్నాము. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంటు బ్యాంకుగా మాత్రమే వ్యవహరించాము.’
TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది.
మరి నేడు @ICICIBank మేము తనఖా పెట్టుకోలేదు అని చెబుతోంది.
అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు?@revanth_anumula తన బ్రోకర్… pic.twitter.com/BKAjesY3yX
— Harish Rao Thanneeru (@BRSHarish) April 12, 2025