Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్.. ఆరోగ్య శాఖపై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ జరగడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్లు జరగటం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణం అయ్యిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మానసిక వైద్యం పొందేందుకు ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తునట్లు? ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? ప్రాణం కోల్పోయిన ఆ మానసిక రోగి మృతికి ఎవరు బాధ్యులు? ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం. అస్వస్థతకు గురయ్యారని తెలిసిన తర్వాత కూడా, బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం అమానుషం. ఉస్మానియా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో పాటు, మిగతా 67 మందికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

