Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం కావాలి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేపించలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదు.. తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకో అని హరీష్ రావు సూచించారు.
ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది.. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది. 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు.. ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా.. ఎందుకు మాట్లాడటం లేదు. పులి అయితే మాట్లాడేవాడివి.. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల పిల్లి
రేవంత్ రెడ్డి మొన్న ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నా
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు
ఆలమట్టి… pic.twitter.com/k50iSwuu7R
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2025