Harish Rao | హైదరాబాద్ : విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సాయిబాబా గుండెపోటుతో మరణించినట్లు నిమ్స్ వైద్యులు ధృవీకరించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను 2014లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదేళ్లపాటు నాగ్‌పూర్ జైలులోనే ఉన్న ఆయన ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యారు.
విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ సాయిబాబా గారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/S9NtXpTcor
— Harish Rao Thanneeru (@BRSHarish) October 13, 2024
ఇవి కూడా చదవండి..
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్
Professor Saibaba | ప్రొఫెసర్ సాయిబాబా మెదడే ప్రమాదకరం..! 2022లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Professor Saibaba | ఎవరీ ప్రొఫెసర్ సాయిబాబా.? వీల్‌చైర్‌లోనే పదేండ్ల పాటు జైల్లో..!!