Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కలిశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రెండు విజ్ఞాపన పత్రాలను సీఎస్‌కు హరీశ్‌రావు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పత్రులను అందజేయాలని సీఎస్‌ను హరీశ్‌రావు కోరారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. ప్రభుత్వానికి 665 పేజీల నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పూర్తిస్థాయి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా.. కేవలం 60 పేజీలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికపై పలు అనుమానాలు ఉన్నాయని, ఇది ఘోష్ రిపోర్టా.. కాంగ్రెస్ రిపోర్టా..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. 665 పేజీల నివేదికను విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.