హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి నిరుద్యోగులపై దిగుజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం వ్యాఖ్యలపై ఆయన స్పంది స్తూ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాపై సీఎం పరిణతి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాటనా అంటూ సీఎంని ప్రశ్నించారు. రెండు నాలల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
జేఎల్ ఫైనల్ ‘కీ’లో తప్పులు .. హైకోర్టులో కేసు నమోదు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి పరీక్షల తుది కీలో తప్పులు ఉన్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కెమిస్ట్రీలో 20 ప్రశ్నలకుపైగా తప్పులు వచ్చాయని వాపోయారు. జేఎల్ ప్రశ్నాపత్రం రూపకల్పనలో టీజీపీఎస్సీ చేసిన తప్పులతో తన ఉద్యోగం పొయిందని నిరుద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేసినట్టు వెల్లడించారు.