Harish Rao | హైదరాబాద్ : ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మద్యం అమ్మకాల లక్ష్యాలను చేరుకోనందుకు 30 మంది ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెమోలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని బయట పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం అమ్మకాలు అరికడతామని, బెల్టు షాపులను మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాల పెంచాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను ఒత్తిడి చేయడం ద్వంద వైఖరికి నిదర్శనం. ఎక్సైజ్ అధికారులు తమ సర్కిళ్ళలో అమ్మకాలను 10 శాతం నుంచి 25 శాతం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, విక్రయ లక్ష్యాలను చేరుకోకపోతే బదిలీ చేస్తానని బెదిరించడం దుర్మార్గం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిన ఎక్సైజ్ పాలసీకి సవరణ ఇదేనా? ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు 1.7 లక్షల బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పనిచేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం శోచనీయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11 నెలలలో సాధించిన మార్పు ఇదేనా అని హరీశ్‌రావు విమర్శించారు.
The recent move by the Revanth Reddy government to issue memos to 30 excise circle inspectors for not meeting liquor sales targets is a complete “U” turn to the Congress party’s manifesto.
Congress promised to curb liquor sales and even close belt shops.
The Revanth Reddy…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 11, 2024
ఇవి కూడా చదవండి..
IAS Officers | రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి
KTR | సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులపై దాడులు.. రేవంత్ పాలనపై కేటీఆర్ ధ్వజం
KTR | ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. కేటీఆర్ ట్వీట్