Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసింది. పేదలకు వైద్యం అందకుండా పోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి.
300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.
ఏడాదిన్నరగా… pic.twitter.com/rm1o4SKaXS
— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2025