Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. అలంపూర్ కోర్టులో రాజోలి రైతుల చేతిలకు బేడీలు వేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. లగచర్ల నుంచి రాజోలి దాకా రైతులకు చేతులకు సంకెళ్లు వేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మరో వైపు రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పౌర హక్కుల నేతలపై నిర్బంధాలు కొనసాగుతున్నాయంటూ నిప్పులు చెరిగారు. ఇవే రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్లు అని హరీశ్‌రావు విమర్శించారు.
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన 12 మంది అన్నదాతలపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ రిమాండ్ ముగియడంతో.. వారిని మహబూబ్‌నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే రాజోలి రైతులకు సంకెళ్లు వేసి అలంపూర్ కోర్టులో హాజరు పరచడం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నేరస్తుల లాగా రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు.
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు నిన్ననే బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4న జైలుకెళ్లిన వీరికి 14 రోజుల తర్వాత కండీషన్ బెయిల్ మంజూరైంది. బెయిల్ వచ్చాక కూడా రైతులకు బేడీలు వేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు.
లగచర్ల నుంచి రాజోలి దాకా
రైతు చేతులకు సంకెళ్లు..
పౌర హక్కుల నేతలపై నిర్బంధాలుఇవే @revanth_anumula చెప్పిన
ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్లు!#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/D5ov54MIEj— Harish Rao Thanneeru (@BRSHarish) June 18, 2025