Harish Rao Birthday | జన హృదయ నేత.. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు సిద్దిపేట ప్రజల కుటుంబ నేత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టినరోజు సందర్బంగా యావత్ సిద్దిపేట నియోజకవర్గంలో పల్లె నుండి పట్టణం వరకు ప్రతి వాడ.. ప్రతి గల్లీలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
సిద్దిపేట అంటే హరీష్ రావు.. హరీష్ రావు అంటే సిద్దిపేట అభివృద్ధి.. అన్న అంటే నేను ఉన్న అని.. ఆపద వస్తే అపద్భాందవునిలా నిత్యం ప్రజల మధ్యే ఉంటు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకులు హరీష్ రావు అంటూ గుండె నిండా ప్రేమతో, నిండు మనసుతో గొప్ప అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలు కొలహాలంగా ఉత్సాహంగా జన నేత జన్మదినోత్సవాలు జరుపుకున్నారు.
సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అతిక్ ఫౌండేషన్, బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాళ్ళకుంట కాలనీ, పాత బస్టాండ్, నర్సాపూర్ చౌరస్తా, అయిత పురుషోత్తం ఆధ్వర్యంలో బురుజు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్స్ బ్రహ్మం, శ్రీకాంత్ గౌడ్, మనీదీప్ ఆధ్వర్యంలో లాల్ కమాన్ వద్ద రక్త దాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అదే విధంగా గణేష్ నగర్ వేప చెట్టు వద్ద కౌన్సిలర్ ప్రవీణ్, విక్టరీ థియేటర్ చౌరస్తా వద్ద కౌన్సిలర్ సాయన్న గారి సుందర్, లిఖిత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, ప్రముఖ వ్యాపార వేత్త, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద, గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం, రావి చెట్టు హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్స్ తదితర కార్యక్రమాలు చేసి అభిమాన నాయకుడు హరీష్ రావు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజా సేవలో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సిద్దిపేట ప్రజానీకం ప్రార్థించారు.