Harish Rao | ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని.. హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని.. హరీశ్‌రావు మండిపడ్డారు.
ఏది అబద్ధం ?
ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా?
కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా? 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా? మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది అబద్దమా? గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం మేం చెప్పిన అబద్దమా? గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా? రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అబద్ధమా? 8 నెలలుగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా? బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల రూ. 275 కోట్లు, సంవత్సరానికి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 70 గేట్లు ఎత్తివేత
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

