Harish Rao | స్థానికతపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి.. హరీశ్‌రావుకు జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో (Harish Rao) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో (Harish Rao) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగేండ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో స్థానికేతరులు కావడం బాధగా ఉందని పోయారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే 33 జీవోపై పోరాటం చేస్తామని హరీశ్‌రావు వారికి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించడానికి కొత్త విధానం రూపొందించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BDS admissions
- BRS
- GO 33
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

