హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి మూడోస్థానమేనని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. రెండోస్థానాన్ని దక్కించుకోవడానికే బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్నదని, అయినా ఫలితం ఉండదన్నారు. దేశాన్ని అధోగతిపాలు చేస్తున్న బీజేపీ.. మునుగోడులో అద్భుతాలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. బీజేపీలో సమానత్వం మాటలకే పరిమితమని, అక్కడ కుల వివక్షను దగ్గర నుం చి చూశానని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనే హక్కు మోదీ కి ఎక్కడిదని ప్రశ్నించా రు. మునుగోడు ఉపఎన్నిక, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ కుట్రలపై స్వామిగౌడ్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. పూర్తి ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
రాజగోపాల్‌కు గుణపాఠం తప్పదు
ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తి స్వలా భం కోసం, ఒక పార్టీ రాజకీయ స్వార్థం కోసం ఉపఎన్నిక రావడం ప్రజలెవరికీ ఇష్టం లేదు. అందుకే రాజగోపాల్‌రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మూడోస్థానానికే పరిమితం కాబోతున్నది.
తెలంగాణను అణగదొక్కుతున్న కేంద్రం
రాష్ట్ర విభజన నుంచి నేటివరకూ తెలంగాణను అణగదొక్కేందుకు కేంద్రం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ర్టాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేస్తున్నది. విభజన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? పొద్దున లేస్తే రాముడి భక్తుడిని అనిచెప్పుకొనే మోదీ.. భద్రాద్రి రామయ్య విషయంలో మాత్రం ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పుచేశారు. తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న బీజేపీ.. మునుగోడులో మాత్రం అద్భుతాలు చేస్తామ ని చెప్పడాన్ని ప్రజలు నమ్మరు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. అటువంటి బీజేపీ.. ఫ్లోరోసిస్‌ను పారదోలి ప్రతిఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న టీఆర్ఎస్పై ఆరోపణలు విడ్డూరం.
మోదీ కార్పొరేట్ శక్తులకే ప్రధాని
మోదీలో మొదటినుంచి ఉన్నవి వ్యాపార లక్షణాలే. అందుకే.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఎంతోమంది బీజేపీ అగ్రనేతలను అవమానకరంగా పక్కకు నెట్టి అనతికాలంలోనే అందలం ఎక్కారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే కార్పొరేట్ శక్తులు, ఆయనకు దగ్గరగా ఉండే బడాబాబులకు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. చివరికి.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా వ్యాపార కోణంలోనే చూస్తున్నారు. భారత్ అంటేనే సర్వమతాల సమ్మేళనం. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాలను విడదీసి, విచ్ఛిన్నం చేసే పనిలో పడ్డారు. గవర్నర్లు ఆయా రాష్ర్టాల్లోని సమస్యల గురించి కేంద్రం తో చర్చించి, పరిష్కరించ కలిగితే బాగుంటుంది. కానీ కేంద్రం చెప్పిందని ఓ రాజకీ యా పార్టీ నేతలా వ్యవహరించడం సరికాదు.
మునుగోడు తీర్పేతో బీజేపీ ఆశలకు సమాధి
డబ్బుతో ఏదైనా చేయొచ్చనే భ్రమలో బతుకున్న రాజగోపాల్‌రెడ్డికి, బీజేపీకి మునుగోడు తీర్పుతో గుణపాఠం చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. మొదట ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నం చేసి.. ఇప్పుడు కనీసం రెండో స్థానమైనా దక్కితే చాలనుకొనే దుస్థితి వచ్చింది. కోట్లు కుమ్మరించేసి ఓటర్లను కొనొచ్చని వాళ్ల ఆశకు ప్రజలిప్పటికే సమాధి కట్టేశారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని ఇప్పటికే రుజువై పోయింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న మునుగోడు ఉపఎన్నిక తీర్పుతో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఆశలకు సమాధి కట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు.
మోదీకి ఎమ్మెల్యేలంటే.. అంగట్లో పశువులే
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసే హక్కు మోదీకి ఎవరిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి రావడం బాధాకరం. ఇవాళ.. దేశమంతా మోదీ నామస్మరణే చేయాలని ఆయన పగటి కలలు కంటున్నారు. దీనికోసమే ఎమ్మెల్యేలను అంగట్లో పశువులను కొన్నట్టు కొంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో అనైతికంగా ప్రభుత్వాన్ని కూలదోసి దొడ్డిదారిన పీఠమెక్కారు. తెలంగాణతోపాటు ఢిల్లీ, పశ్చిమ బంగాల్ రాష్ర్టాల్లోనూ ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సీపీఐ, సీపీఎం శ్రేణులు మంగళవారం గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక తదితర గ్రామా ల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కు ఓటేయాలని నినాదాలు చేస్తున్న వామపక్ష నేతలు