బోధన్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): బోధన్ మాజీ ఎమ్మె ల్యే షకీల్‌ను ఓ పాత కేసులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియల్లో పా ల్గొనేందుకు షకీల్ వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్న షకీల్.. తల్లి మరణవార్త తెలుసుకొని హైదరాబాద్ రాగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించారు. షకీల్ తల్లి షగు ప్త ఆదిబ్ (78) బుధవారం కన్నుమూశారు.
షగుప్త 2005లో హెచ్ఎంగా ఉద్యోగ విరమణచేశారు. బోధన్‌లో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.