నాగర్కర్నూల్, ఆగస్టు 4 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్ఠానంతో మంతనాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది.
కొంతకాలంగా బీజేపీతో టచ్లో ఉన్న గువ్వల తాను పార్టీ మారుతున్న విషయాన్ని వారం రోజులుగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో చెప్పినట్టుగా తెలిసింది. గువ్వలకు బీఆర్ఎస్లో పదవులు కల్పించగా నేడు పార్టీ మారడంపై పలు విమర్శలకు తావిస్తున్నది.