వేములవాడ, ఆగస్టు 18: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ న్యాయస్థానం మొదటిసారిగా ఆన్లైన్ జూమ్ వీడియో ద్వారా సాక్ష్యాన్ని స్వీకరించింది. శుక్రవారం వేములవాడ సబ్ కోర్టులో రెండు కేసులను న్యాయమూర్తి సత్తు రవీందర్ విచారించారు. చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేధింపులతో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన సాక్షిగా సిరిసిల్ల ఏరియా దవాఖాన వైద్యురాలు సుశ్వేత ఉండగా, ప్రస్తుతం ఆమె జడ్చర్ల దవాఖానలో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె గర్భిణి కావడంతో జూమ్ వీడియో ద్వారా ఆమె సాక్ష్యాన్ని వినిపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆమె అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి, న్యాయవాదులు రఘురామన్, నక దివాకర్ సమక్షంలో ఆన్లైన్ ద్వారా సాక్ష్యాన్ని కోర్టుకు వెల్లడించారు.