బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 09:09:00

ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే..మన మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి హరీశ్ రావు

ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే..మన మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: భూమండలంలో అన్నిటికంటే విలువైనది ప్రకృతి అని..జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపై ఆధారపడి ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రజలకు సందేశాన్నిఇచ్చారు. మొక్కలు లేకపోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుందని హరీశ్ రావు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ప్రకృతి పై దృష్టి  పెడుతున్నాయని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి..వాటిని  సంరక్షించాలి కోరారు. చెట్లను నాటడం వాటిని సంరక్షించడం ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. 

ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత..130 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం చెట్లను నాటి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు.కాలుష్యాన్ని నియంత్రించేందుకు..చెట్లను పెంచడం..అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో  ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి , పర్యావరణంపై బోధించాలని ప్రతి ఒక్క విద్యార్థి తో మొక్క నాటించాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. 
logo