హన్వాడ : ప్రతి ఒక్కరూ భక్తి భవాన్ని పెంపొందించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం గ్రామంలో నూతనంగా నిర్మించిన సంగమేశ్వర స్వామి ( Sangameshwar Swamy) దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపనలో మహోత్సవంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మండలంలో దేవాలయాభివృద్ధి కోసం మండపాల నిర్మాణానఇకి నిధులు ఇచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో బఈఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.