కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 16 : అంకెల గారడీతో రైతులను సీఎం రేవంత్‌రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40శాతం కూడా రుణమాఫీ కాలేదన్నారు.
అబద్ధాలకు రేవంత్‌రెడ్డి అంబాసిడర్‌గా మారారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవాచేశారు. పూడూరులో 680 మంది రైతులుంటే, 142 మందికి మాత్రమే మాఫీ అయినట్టు వివరించారు.
ఆదిలాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసి మరీ సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌లో మండిపడ్డారు.
బోథ్, ఆగస్టు 16 : రుణమాఫీ చేయక రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని తన నివాసంలో మాట్లాడారు.
పెద్దపల్లి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి తుపాకీ రాముడి ముచ్చట్లు బంద్ చేయాలని మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, కోరుకంటి చందర్ హితవుపలికారు. శుక్రవారం పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు.
సంగారెడ్డి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఇకముందు హరీశ్‌రావు జోలికొస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. శుక్రవారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్‌తో కలిసి మాట్లాడారు.
రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాలు చేసిన వీడియోను విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రదర్శించారు. ఎలాంటి షరతుల్లేకుండా రుణమాఫీ అమలుచేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ సవాల్ చేశారని కాంత్రికిరణ్ వివరించారు.
నార్కట్‌పల్లి, ఆగస్టు 16 : రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ ఎమ్మెల్యే లింగయ్య డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి
మిర్యాలగూడ, ఆగస్టు 16 : కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి మిర్యాలగూడలో విమర్శించారు.