రాజోళి, జనవరి 19 : జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం వారు పెద్ద ధన్వాడలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు తమ నుంచి వ్యవసాయ కోసమని భూములు కొనుగోలు చేసి వాటిని కంపెనీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అప్పుడే తమకు నిజం చెప్పి ఉంటే ఆ భూములను అమ్మేటోళ్లం కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.