మెదక్: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్‌కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు. మాసాయిపేట మండలం హకీంపేటలోని జమున హ్యాచరీస్ కంపెనీలో సర్వే జరుగుతోంది.
సర్వే నెంబర్ 130లోని 18 ఎకరాల భూములకు సంబంధించి ఈ సర్వే జరుగుతోంది. మాసాయిపేట తహశీల్దార్ మాలతి, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీ సుజాత ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అసైన్డ్ భూములను ఈటల కబ్జా చేశారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈటలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తోంది. 130 సర్వే నెంబర్లో ఎక్కువ భూములు కబ్జా జరిగినట్లు సమాచారం ఉందని తహశీల్దార్ మాలతి చెప్పారు.