హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం సిట్ అధికారుల విచారణకు హాజరై, వాంగ్మూలం ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.