కందుకూరు, జూలై 28: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.100 కోట్లతో 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్‌తో కలిసి ఆ వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత మ్యాప్‌ను పరిశీలించాక అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఫార్మాసిటీలో మెడికల్ కళాశాల ఏ ర్పాటుకుబీఆర్ఎస్ హయాంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి వేసిన శిలాఫలకం పక్కనే ఈ వర్సిటీ స్థాపనకు ఏర్పాట్లు చేయడం గమనార్హం.
7న అమృతసర్‌లో ఓబీసీ జాతీయ మహాసభలు
హైదరాబాద్, జూలై28 (నమస్తే తెలంగాణ): పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ నగరంలో ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదురొంటున్న సమస్యలు, డిమాండ్ల సాధనకు మహాసభల్లో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. మహాసభకు హాజరుకావాలని కోరు తూ ఆదివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు బం డి సంజయ్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించామని తెలిపారు.