Capable city | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వినూత్న విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భౌగోళిక స్వరూపం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మౌలికవసతులు తదితర పలు అంశాలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఐటీ రంగంలో ఇప్పటికే బెంగళూరుతో పోటీ పడుతున్న హైదరాబాద్.. బహుళజాతి కంపెనీలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ల ఏర్పాటులోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నది. తద్వారా దేశ ఐటీ రాజధాని బెంగళూరుతో సమానంగా నిలిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 40 జీసీసీలు ఉన్నాయని, వీటిలో హైదరాబాద్ 11, బెంగళూరు 11 జీసీసీలతో అగ్రస్థానంలో నిలిచాయని తాజా సర్వే నివేదికలో నాస్కామ్ వెల్లడించింది. ద్వితీయ స్థానంలో పుణె, తృతీయ స్థానంలో ముంబై ఉన్నట్టు పేర్కొన్నది.
దేశంలోని జీసీసీలు నగరం కొత్తవి పాతవి మొత్తం