హనుమకొండ చౌరస్తా, జూన్ 5: నీట్-2024 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. శృతకీర్తి 662/720, పీ హర్షిత 652 మార్కులు సాధించి ఎస్సార్ కీర్తిప్రతిష్టలను జాతీయస్థాయిలో నిలబెట్టారని చెప్పారు. కే రమేశ్ 630, ఎం కీర్తి 626, టీ శాలిని 621, వీ సాయిప్రసాద్ 621 మార్కులు, 105 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారని వివరించారు. 50 ఏండ్లుగా ఉత్తమ ప్రణాళికలతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తున్నట్టు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. ఏటా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులు.. ఈ సంవత్సరం ఐపీఈ, జేఈఈ (మెయిన్)లో జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు.