అయిజ/అలంపూర్, జూన్ 19: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ఏరువాకను ఘనంగా జరుపుకొన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టిన ఘటనలో అక్రమంగా కే సులు పెట్టడంతో 12 మంది రైతులు జైలుకు వెళ్లారు. దీంతో ఈ నెల 11న జరుపు కోవాల్సిన ఏరువాక పండుగను నిర్వహించలే దు.
తమవారు ఇండ్లకు వచ్చాకే జరుపు కొంటామని నాడు స్థానికులు తీర్మానించారు. బుధవారం రాత్రి పాల మూరు జైలు నుంచి రైతులు విడుదలై గ్రామానికి చేరడంతో పం డుగను జరుపుకోవాలని చాటింపు వేయించా రు. ఈ క్రమంలో గురువారం కాడెద్దులను తుంగభద్రలో స్నానం చేయించి రంగులువేసి ముస్తాబు చేశారు. ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసిన రోజే తమకుని జమైన పండుగ అని చెబుతున్నారు.