Errolla Srinivas | ఎక్కడ ఎన్నికలైనా కోట్లు కుమ్మరిస్తున్నారు.. గురుకులాలకు ఒక్క రూపాయి ఇవ్వరా.. ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజం
Errolla Srinivas | గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్‌ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకంత ద్వేషమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Errolla Srinivas | గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్‌ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకంత ద్వేషమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గురుకులాలు నాశనం కావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికేనా ఈ కుట్ర అని నిలదీశారు. గురుకలాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. సమస్యలపై విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
గురుకులాలపై ఒక్క రోజైనా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిండా అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. గురుకుల విద్యార్థుల మరణాలకు సంతాపం తెలిపిండా అని నిలదీశారు. ముఖ్యమంత్రే కదా విద్యాశాఖ మంత్రి.. మరి గురుకులాలు ఎందుకు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా అని నిలదీశారు. వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఎక్కడ ఎన్నికలు జరిగిన కోట్లు కుమ్మరిస్తున్నారని అన్నారు.. గురుకులాల కోసం మాత్రం ఒక్క రూపాయిని కేటాయించడం లేదని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

